: నేనూ ఓ ‘ఇంటి’ వాడినయ్యానంటున్న సుడిగాలి సుధీర్


‘నేనూ ఒక ఇల్లు కొనుక్కుని ఒక ‘ఇంటి’వాడినయ్యాను’ అని ‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్ అన్నాడు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సందర్భంగా మల్లెమాల ఎంటర్ టెయిన్ మెంట్స్, ఈటీవీ తెలుగు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్ఐ)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు చెబుతున్నానని, వారి మద్దతు లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News