: జయప్రదను పదవి నుంచి తొలగించిన యూపీ సీఎం
యూపీ రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. వెటరన్ హీరోయిన్, అమర్ సింగ్ అనుచరురాలు జయప్రదను ఫిల్మ్ ప్రమోషన్ బోర్డు చైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఈ ఉదయం తన అనుచరులతో సమావేశమై నలుగురు మంత్రులను తీసేస్తున్నట్టు చెప్పిన ఆయన, ఆపై జయప్రదకూ ఉద్వాసన పలికినట్టు పేర్కొన్నారు. ఆమె అమర్ సింగ్ వర్గంలో ఉండటం, తండ్రికి, తనకు మధ్య విభేదాలకు అమర్ సింగ్ కారణమని అఖిలేష్ భావిస్తుండటంతోనే జయప్రదను తొలగించినట్టు తెలుస్తోంది. సమాజ్ వాదీ నుంచి విడిపోయి మరో పార్టీ పెట్టే విషయంలో మాత్రం ఆయనింకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.