: దివాలాకు సిద్ధంగా ఉన్న 8 కంపెనీలపై సెబీ బ్యాన్
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి, దివాలాకు సిద్ధంగా ఉండి, గడచిన రెండు సంవత్సరాల నుంచి నిబంధనలను అతిక్రమిస్తూ వచ్చిన ఎనిమిది కంపెనీలపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది. ఈ కంపెనీలు గత రెండేళ్ల నుంచి ఆదాయ వ్యయ వివరాలను వెల్లడించలేదని, ఈ కంపెనీల్లోని 40 మంది డైరెక్టర్లు కూడా కాపిటల్ మార్కెట్ నిబంధనలు మీరారని, వారిని కూడా మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేశామని సెబీ ప్రకటించింది. మెరైన్ గ్రూప్ కంపెనీ, అంబుజా జింక్, హితీష్ టెక్స్ టైల్ మిల్స్, మానవ్ ఫార్మా, సీక్వెల్ సాఫ్ట్ ఇండియా, ఞ యాక్ ఫార్మా అండ్ కాస్మెటిక్స్, రుషోదయ్ అండ్ కంపెనీ, స్టెరిలైట్ బ్రిక్స్ సంస్థలపై బ్యాన్ విధించినట్టు తెలిపింది. ఈ సంస్థల కారణంగా ఇన్వెస్టర్లు మరిన్ని ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ అధికారి ఒకరు తెలిపారు.