: కేజ్రీవాల్ వరం... 70 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్!


న్యూఢిల్లీలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న 70 వేల మందికి వారి జీవితంలో అతిపెద్ద బహుమతిని దీపావళి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుర్తింపు పొందిన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించిన ఆయన, ఉద్యోగుల వివరాలను నవంబర్ 15లోగా వెల్లడించాలని ఆదేశించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి ఉద్యోగుల వివరాలతో కూడిన ప్రతిపాదనలను పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే వివిధ పాఠశాలల్లో కాంట్రాక్టు టీచర్లుగా ఉన్నవారిని రెగ్యులరైజ్ చేసే ఫైల్ ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం నిమిత్తం పంపామని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 17 వేల మంది టీచర్లను పూర్తి స్థాయి ఉద్యోగులుగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకోనున్నామని, లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఫైల్ పై సంతకం పెట్టకుంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News