: 6 జీబీ ర్యామ్ తో శాంసంగ్ తొలి స్మార్ట్ ఫోన్, ఫ్రంట్, బ్యాక్ 16 ఎంపీ కెమెరాలతో గెలాక్సీ సీ9 ప్రో


ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన మరో స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ ఆవిష్కరించింది. తొలిసారిగా 6 జీబీ ర్యామ్ తో 'గెలాక్సీ సీ9 ప్రో'ను రూ. 31,700 ధరపై నవంబర్ 11 నుంచి విక్రయించనుంది. ఈ ఫోన్ ఫీచర్లు అధికారికంగా విడుదల కాగా, 1080/1920 పిక్సెల్ అమోలెడ్ డిస్ ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, ముందు, వెనుక 16 ఎంపీ కెమెరాలు, 64 జీబీ ఇన్ బిల్ట్ మెమొరీ, 256 జీబీ వరకూ విస్తరించుకునేందుకు వీలున్న మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ తదితర సదుపాయాలున్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వీఓ ఎల్టీఈ సౌకర్యాలూ ఉన్న ఈ ఫోన్ 6 అంగుళాల స్క్రీన్ ను కలిగుంటుంది.

  • Loading...

More Telugu News