: ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో బెస్ట్, వరస్ట్ ఎయిర్ పోర్ట్స్ ఏవో తెలుసా?


ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో బెస్ట్, వరస్ట్ ఎయిర్ పోర్ట్స్ పై 'గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్' వెబ్ సైట్ సమగ్రంగా పరిశీలించి ఓ జాబితా తయారు చేసింది. ప్రయాణికులను ఇంటర్వ్యూ చేసి, వారి మనోభావాలను, విమానాశ్రయాల్లో సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ లిస్టు తయారు చేసింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు వేచి చూసే సమయంలో వారికి బోర్ కొట్టకుండా చేపట్టిన చర్యలు, షాపింగ్, భోజన, ఇతర సౌకర్యాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ ఉత్తమ విమానాశ్రయాల జాబితాలో.... ప్రయాణికులకు బోర్ కొట్టకుండా మాసాజ్ చైర్స్, బట్టర్ ఫ్లై గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్లు కలిగి ఉన్న సింగపూర్ లోని చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానం సంపాదించుకుంది. ఈ విమానాశ్రయంలో 40 మీటర్ల ఎత్తులో నీరు ధారలా (ఫౌంటేయిన్) ప్రవహించే జువెల్ అనే కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. ఇది 2018కి పూర్తి కానుంది. దీని తరువాతి స్థానాల్లో *ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం (సియోల్, దక్షిణ కొరియా) * హనెడా అంతర్జాతీయ విమానాశ్రయం (టోక్యో, జపాన్) * థావోయువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం (థైపీ, థైవాన్) * మ్యూనిచ్ అంతర్జాతీయ విమానాశ్రయం (జర్మనీ) * కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఒసాకా, జపాన్) * వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం (వాంకోవర్, కెనడా) * హెల్సింకీ అంతర్జాతీయ విమానాశ్రయం (వాంటా, ఫిన్ల్యాండ్) * తల్లిన్ అంతర్జాతీయ విమానాశ్రయం (తల్లిన్, ఈస్టోనియా) * క్లోటెన్ అంతర్జాతీయ విమానాశ్రయం (జ్యూరిచ్, స్విడ్జర్ల్యాండ్) ఇక చెత్త ఎయిర్ పోర్టుల జాబితాలో... * కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (జెడ్డా, సౌదీ అరేబియా) * జుబా అంతర్జాతీయ విమానాశ్రయం (జుబా, సౌత్ సూడాన్) * పోర్ట్ హార్కోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం (పోర్ట్ హార్కోర్ట్, నైజీరియా) * తాష్కెంట్ అంతర్జాతీయ విమానాశ్రయం (తాష్కెంట్, ఉజ్జెకిస్తాన్) * సాంటోరిని విమానాశ్రయం (సాంటోరిని, గ్రీస్) * చనియా అంతర్జాతీయ విమానాశ్రయం (క్రెటె, గ్రీస్) * హెరాక్లియన్ అంతర్జాతీయ విమానాశ్రయం (క్రెటె, గ్రీస్) * సిమన్ బోల్వియర్ అంతర్జాతీయ విమానాశ్రయం (కారాకస్, వెనిజూలా) * లండన్ లుటన్ అంతర్జాతీయ విమానాశ్రయం (లుటన్, ఇంగ్లాండ్) * త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఖఠ్మాండు, నేపాల్)

  • Loading...

More Telugu News