: కృష్ణా నదీ నీటి పంపకాల తీర్పుపై ముగిసిన తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
కృష్ణా నదీ నీటి పంపకాలపై ఇటీవలే బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలపడానికి మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ భేటీలో హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ అంశంపై చర్చించడానికి ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.