: గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేస్తున్న టాలీవుడ్ స్టార్స్


హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో దక్షిణాది చిత్రపరిశ్రమ తారలు సందడి చేశారు. సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ కు శ్రీకారం చుట్టిన టాలీవుడ్ నటులు... నేడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్ వుడ్ కు చెందిన పలువురు ఆర్టిస్టులు ఈ సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లో పాల్గొంటున్నారు. గతంలో రాష్ట్ర, జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సుధీర్ బాబు టాలీవుడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా, ఇప్పటికే సెలబ్రిటీ క్రికెట్ లీగ్, సెలబ్రిటీ కబడ్డీ లీగ్ నిర్వహిస్తుండగా, తాజాగా బ్యాడ్మింటన్ లీగ్ కూడా చోటు సంపాదించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News