: ఇస్లామిక్ స్టేట్‌పై ఇరాక్ అంతిమ పోరాటంలో మరో విజయం.. మోసుల్ ప్రాంతంలోని కోరాకోష్‌లోకి దూసుకువెళ్లిన‌ దళాలు


ఇరాక్‌లో తుదిపోరు మొద‌లైంది. 2014 నుంచి ఇస్లామిక్ స్టేట్ అధీనంలో ఉన్న మోసుల్ న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి ఇరాక్ సైన్యం, కుర్దిష్ ద‌ళాలు(54 వేల మంది) ఇటీవ‌ల క‌ద‌లివెళ్లి ఆ న‌గ‌రాన్ని చుట్టుముట్టిన‌ సంగ‌తి తెలిసిందే. తాజాగా విజ‌య‌వంతంగా ఆ భూభాగంలోకి ద‌ళాలు ప్ర‌వేశించిన‌ట్లు ఇరాకీ ద‌ళాలు ప్ర‌క‌టించాయి. మోసుల్‌ సమీపంలోని క్రిస్టియన్‌ నగరమైన కోరాకోష్‌లోకి తాము దూసుకువెళ్లిన‌ట్లు తెలిపాయి. ప్ర‌స్తుతం అమెరికా రక్షణశాఖ కార్యదర్శి యాష్‌కార్టర్‌ బాగ్దాద్‌ పర్యటనలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విజయం దక్కడం గ‌మ‌నార్హం. ఇరాక్‌ ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీతో యాష్‌కార్ట‌ర్ భేటీ అయ్యారు. మోసుల్ న‌గరంలో ఉగ్ర‌వాదుల‌పై పోరాడ‌డానికి అమెరికా సంకీర్ణసేనలు వాయు, పదాతి మార్గాన సాయం చేస్తున్నాయి. కొన్ని రోజుల ముందే ఇరాకీ దళాలు బార్టెల్లా అనే ఓ క్రిస్టియన్‌ గ్రామాన్ని కూడా త‌మ అధీనంలోకి తెచ్చుకున్నాయి. 2003 తర్వాత అమెరికా ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న అతిపెద్ద దాడి ఇదే.

  • Loading...

More Telugu News