: చిన్నారుల మ‌ధ్య చిరునవ్వులు చిందిస్తూ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు!


చిన్నారుల మ‌ధ్య చిరునవ్వులు చిందిస్తూ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు దిగిన తాజా ఓ ఫొటో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. తమ అభిమాన నటుడితో ఫొటో దిగుతున్నందుకు చిన్నారులు ఎంతో సంబరప‌డిపోయారు. సినిమాల్లో క‌నిపించే మ‌హేశ్‌బాబు త‌మ ప‌క్క‌న ఉండ‌డంతో ఆకాశమంత ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఎంతో ఆనందపడిపోతూ ‘శ్రీమంతుడు’ పక్కన నిలబడి పోజులిచ్చారు. చిన్నారుల్లో క‌లిసిపోయిన మహేశ్‌బాబు వారిలాగే న‌వ్వుతూ కెమెరా వంక చూశారు. చిన్నారుల‌తో ఫొటో దిగడానికి ఆయన కూడా ‘దూకుడు’ చూపించారు. ప్రస్తుతం ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. మురుగదాస్ తీస్తోన్న‌ చిత్రంలో మ‌హేశ్‌బాబు నటిస్తున్నారు. ఈ షూటింగ్ స‌మ‌యంలోనే చిన్నారుల మ‌ధ్య మ‌హేశ్‌ ఈ ఫొటో దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను మహేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, మ‌హేశ్‌బాబు స‌ర‌న‌స ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్ న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కొన‌సాగుతోంది.

  • Loading...

More Telugu News