: ట్రంప్ పత్రికా సమావేశంలో జర్నలిస్టులకు అవమానం.. మీడియాపై దాడి.. బయటకు గెంటివేత!
అమెరికా అధ్యక్ష రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇన్నాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ట్రంప్ ఓ అడుగు ముందుకేసి మీడియాను గెంటేయించారు. దీంతో వివాదం రాజుకుంది. వాషింగ్టన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ట్రంప్ సమావేశానికి మీడియాతో పాటు పలువురిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా హిల్లరీ క్లింటన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వివాదాస్పద ప్రవర్తన కారణంగానే మీరు విమర్శలపాలవుతున్నారని మీడియా ప్రతినిధులు హితవు పలకడంతో ట్రంప్ మద్దతుదారులకు మండిపోయింది. దీంతో ట్రంప్ ను ప్రశ్నించడానికి మీరెవరంటూ మీడియాను నిలదీశారు. ట్రంప్ ను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై దాడికి దిగారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాను దగాకోరుగా అభివర్ణించి, ట్రంప్ వ్యతిరేకవర్గంగా పేర్కొన్నారు. మైకులు విసిరికొట్టి వారిపై భౌతిక దాడులకు దిగి, బయటకు గెంటేశారు. దీనిపై మీడియా మండిపడుతోంది. ఇలా వివాదాస్పదంగా ప్రవర్తించడం.. ఆ తరువాత క్షమాపణలు చెప్పడం ట్రంప్ కు అలవాటుగా మారింది.