: హిల్లరీ క్లింటన్ ప్రధాన ప్రచార కార్యాలయంలో అనుమానాస్పద కవరు
అమెరికా అధ్యక్షపదవి రేసులో ముందున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రధాన ప్రచార కార్యాలయంలో ఈ రోజు కలకలం రేగింది. కార్యాయంలో తెల్లటిపొడితో ఉన్న అనుమానాస్పద కవర్‌ను అధికారులు గుర్తించారు. ఆ సమయంలో హిల్లరీ క్లింటన్ అక్కడే వున్నారు. వెంటనే ఆమెను అక్కడి నుంచి బ్రూక్లిన్‌లోని ఆఫీస్‌కు తరలించిన తర్వాత అధికారులు ఆ కవరుని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఆమె ఆఫీసు ఉన్న 11వ అంతస్తు మొత్తాన్ని ఖాళీ చేయించి, ఆ కవరుని ల్యాబ్‌కు తరలించారు. ఈ ఘటనతో క్లింటన్ నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమాల్లో భద్రతను మరింత పెంచారు. అయితే ఆ తెల్లటిపొడి హానికారక పదార్థం కాదని పరీక్షల ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు. ఎన్వలప్‌పై ఎలాంటి బెదిరింపులు కూడా లేవని పేర్కొన్నారు. ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.