: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. త్వరలోనే వీడియో కాల్స్ సర్వీస్
ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ తన వినియోగదారులకు మరో క్రేజీ ఫీచర్ ను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు మెసేజింగ్, వాయిస్ కాల్స్ ను అందిస్తూ వచ్చిన వాట్సాప్... త్వరలోనే వీడియో కాల్స్ సర్వీస్ ను అందించనుంది. విండోస్ ఫోన్, ఐఫోన్ లలో ఇప్పటికే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్... త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్ లలో కూడా వీడియో కాల్స్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. పరీక్షల నిమిత్తం విండోస్ మొబైల్స్ లో వీడియో కాల్ ఆప్షన్ ను ఇప్పటికే వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని స్పానిష్ వెబ్ సైట్ ఒకటి తెలిపింది. వీడియో కాల్స్ అందుబాటులోకి వస్తే... యూజర్లు ఒకరినొకరు చూసుకుంటూ ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో పాటు, బ్యాక్ కెమెరాతో కూడా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు.