: మీరేమో వైద్యానికి విదేశాలకు వెళ్తారు... మరి సైనికులను పట్టించుకోరా?: కేంద్రంపై ధ్వజమెత్తిన సైనికుడి సోదరి
సైనికులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పాకిస్థాన్ రేంజర్స్ దాడుల్లో గాయపడ్డ జవాను సోదరి ధ్వజమెత్తింది. తన సోదరుడు గుర్నామ్ సింగ్ కు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని గుర్జీత్ కౌర్ ఆరోపించారు. సరైన వైద్య సౌకర్యాలు లేవని రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్తుంటారని, మరి గాయపడ్డ సైనికులను ఎందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. అలా వీలు కానీ పక్షంలో విదేశీ వైద్య నిపుణులను తీసుకొచ్చి వారికి ఇక్కడే మెరుగైన వైద్య సౌకర్యాలు అందించవచ్చు కదా? అని ప్రశ్నించారు. తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని, అతనిని కాపాడేందుకు విదేశాలకు తీసుకెళ్లవచ్చుకదా? అని ఆమె అన్నారు.