: బాన్సువాడలో దర్జాగా పేకాడుతున్న మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు.. రూ.1.11 లక్షలు స్వాధీనం
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పేకాటరాయుళ్లతో కలిసి దర్జాగా పేకాడుతోన్న మాజీ ఎమ్మెల్యే కె.గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో పేకాట శిబిరం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ దాడి చేశారు. దాడుల్లో గంగాధర్ సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 1.11 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.