: ఫడ్నవిస్, రాజ్ థాకరేలకు దర్శక, నిర్మాతల హామీ... ముగిసిన సినిమా విడుదల వివాదం


'యే దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరేలతో ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జొహార్ సమావేశమయ్యాడు. ఈ భేటీకి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ముఖేష్ భట్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం ఫడ్నవిస్ నివాసంలో జరిగింది. సమావేశానంతరం ముఖేష్ భట్ మాట్లాడుతూ, "మా మధ్య ఒక నిర్మాణాత్మకమైన మీటింగ్ జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన భావోద్వేగాల గురించి చర్చించాం. మాకు ఇండియానే తొలి ప్రాధాన్యం. ఇకపై పాక్ నటీనటులతో సినిమాలు నిర్మించబోమని ముఖ్యమంత్రికి స్పష్టం చేశాం" అని తెలిపారు. అంతేకాకుండా అమర జవాన్ల త్యాగాలు ప్రతిబింబించేలా సినిమా ప్రారంభంలో న్యూస్ రీల్ ను ప్రదర్శిస్తామని చెప్పారు. దీనికి తోడు ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు కరణ్ తో పాటు ఇతర నిర్మాతలు విరాళాలు ఇస్తారని తెలిపారు. సమస్య పరిష్కారమైందని... అనుకున్న తేదీనే సినిమా విడుదల అవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News