: ట్యాక్స్ ఎగ‌వేత‌కు ఎన్నో అడ్డ‌దారులు.. ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో బ‌స్సులు మారుస్తోన్న ప్రైవేటు ట్రావెల్స్


త‌మ ట్రావెల్స్ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తోన్న ప్ర‌యాణికుల‌కు మ‌రింత మెరుగైన‌ సౌక‌ర్యాలు ఎలా అందించాల‌ని ఆలోచించాల్సింది పోయి ట్యాక్స్ ను ఎలా ఎగ్గొట్టాల‌నే అంశంపైనే ప్రైవేట్ ట్రావెల్స్ య‌జ‌మానులు దృష్టి సారిస్తున్నారు. ట్యాక్స్ ఎగ‌వేత‌కు ఎన్నో అడ్డ‌దారులు తొక్కుతున్నారు. దీంతో ప్ర‌యాణికులు క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. హైదరాబాద్-కందుకూరు మధ్య పలు ప్రాంతాల్లో రెండు బస్సుల్లోంచి ప్రయాణికులను దించేసి అక్కడి నుంచి ఆ ప్రయాణికులను వేరే బస్సుల్లో కూర్చోమన్నారు శ్రీ కృష్ణా ట్రావెల్స్ సిబ్బంది. ఈ సమయంలో అక్కడ ప్రయాణికులు మీడియాతో తమ గోడును తెలిపారు. తమను బస్సుల్లోంచి దించి వేరే బ‌స్సులోకి ఎక్కమంటున్నారని చెప్పారు. ఇటువంటి చ‌ర్యలపై ప్ర‌భుత్వం చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. బ‌స్సులో ఉన్న తమ సామగ్రి అంతా దించి మ‌రో బ‌స్సులోకి మారుస్తూ తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News