: సౌరశక్తితో నడిచే ఇన్వర్టర్లు వచ్చేశాయి


ఫోటాన్‌ సంస్థ ఇళ్లలో వాడకానికి గాను సౌరశక్తితో విద్యుత్తును తయారు చేసుకుని, కరెంటు లేని సమయంలో వినియోగానికి ఉపకరించే ఇన్వర్టర్లను అందుబాటులోకి తెచ్చింది. అధిక సామర్థ్యంతో ఇన్వర్టర్లను, సోలార్‌ మాడ్యూళ్లు, బ్యాటరీలను అనుసందానించి వీటిని రూపొందించారు. ఇన్వర్టర్‌, సోలార్‌ ఛార్జర్‌, ఏసీ చార్జర్‌ పనులు చేసే ఆఫ్‌ గ్రిడ్‌ ఇన్వర్టర్‌ పీసీయూ గోడకు అమర్చగలిగేలా రూపొందించారట.

వీటిని గృహవినియోగదారులకోసం అందుబాటులోకి తెచ్చినట్లు ఫోటాన్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ వారు ప్రకటించారు. మామూలుగానే పవర్‌ కట్‌ విశ్వరూపం చూపిస్తున్న మన రాష్ట్రం వంటి ప్రాంతాల్లో ఇన్వర్టర్ల అవసరం చాలానే ఉంటుంది. అదే సమయంలో.. విద్యుచ్ఛక్తి మీద ఆధారపడకుండా.. సౌరశక్తితో విద్యుత్తు తయారుచేసి... కరెంటు లేని సమయంలో ఆదుకునే ఇన్వర్టర్‌ అంటే బహుళ ఉపయోగమే అవుతుంది.

  • Loading...

More Telugu News