: ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. థాయ్‌లాండ్‌ను చిత్తుచేసిన కబడ్డీ జట్టు


ప్రపంచకప్ కబడ్డీ ఫైనల్‌లోకి భారత జట్టు దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో ఆతిథ్య జట్టును 53 పాయింట్లతో చిత్తుచేసిన భారత్ సగర్వంగా ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ పోరుకు ముందు కొండంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. శనివారం ఇరాన్ జట్టుతో ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి థాయ్‌లాండ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. రైడర్లు, డిఫెండర్లు సమష్టిగా సత్తా చాటడంతో మ్యాచ్ ప్రథమార్ధంలో 36-8తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించి చివరికి 73-20తో మ్యాచ్‌ను ముగించింది.

  • Loading...

More Telugu News