: జమునలాగా ఉన్నావంటే చాలా గ్రేట్ గా ఫీలయ్యేదాన్ని: సీనియర్ నటి 'భీష్మ' సుజాత


ప్రముఖ సినీ నటి జమునలాగా ఉన్నావంటే చాలా సంతోషపడే దానినని, గ్రేట్ గా ఫీలయ్యే దానినని అలనాటి సినీ నటి 'భీష్మ' సుజాత అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి రావడానికి ఒక రకంగా నటి జమునే కారణమని అనుకుంటూ ఉంటానని, ఎందుకంటే, ఆమె కళ్లు లాగానే తన కళ్లు కూడా పెద్దవిగా ఉండేవని అందరూ అనేవారని, దీంతో, తాను కూడా సినిమాల్లోకి రావాలని అనుకునే దానినని ఆమె అన్నారు. జమున అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఆమెను ‘అక్క’ అని పిలవాలని ఆశ పడేదానినని అన్నారు. అయితే, తామిద్దరం కలిసి నటించిన ఒక డ్రామాలో జమునే తనను అక్కా అని పిలవాల్సి వచ్చిందంటూ నాటి విషయాలను చెప్పుకొచ్చారు. కాగా, భీష్మ, దానవీర శూరకర్ణ, నిప్పులాంటి మనిషి తదితర చిత్రాల్లో భీష్మ సుజాత నటించారు. అంతేకాకుండా, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా అయిన ఆమె .. మంజుల, జ్యోతిలక్ష్మి, రాజ సులోచనకు డబ్బింగ్ చెప్పారు. తాజాగా, 'ఓకే బంగారం' చిత్రంలో ప్రకాష్ రాజ్ భార్య పాత్రకు తమిళంలో డబ్బింగ్ చెప్పింది కూడా తనే!

  • Loading...

More Telugu News