: ఐ ఫోన్ 7 పేలడంతో కారు లోపలి భాగాలు ధ్వంసం!
ఐఫోన్ 7ను కొనుగోలు చేసిన ఆస్ట్రేలియాకు చెందిన సర్ఫింగ్ ఇన్ స్ట్రక్టర్ మ్యాట్ జోన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తన కారులోని బట్టల కింద ఈ ఫోన్ ను ఉంచి సర్ఫింగ్ పాఠాలు చెప్పేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పటికీ, కారులో నుంచి పొగలు బయటకు వస్తున్నాయి. దీంతో, విస్తుపోయిన మ్యాట్ జోన్స్ కు ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది. కారులో పెట్టిన తన ఐఫోన్ కాలుతుండటాన్ని చూశాడు. ఈ ఫోన్ కాలడంతో కారు లోపలి భాగాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనకు కారణం ఐఫోన్ పేలడమేనని మ్యాట్ జోన్స్ ఫిర్యాదు మేరకు ఆపిల్ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని సంస్థ అధికారులు పేర్కొన్నారు.