: సచివాలయంలో ఏపీ వాడుతున్న భవనాలను తెలంగాణకు ఇవ్వాలి: టి-కేబినెట్ తీర్మానం


సచివాలయంలో ఏపీ రాష్ట్రం వినియోగిస్తున్న భవనాలను తెలంగాణకు ఇవ్వాలని గవర్నర్ ను కోరుతూ టీ-కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు.. * 1047 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ గా అప్ గ్రేడ్ చేసేందుకు అంగీకారం * బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై తదుపరి కార్యాచరణకు మంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లడం * మహిళా ఉద్యోగులకు 90 రోజుల శిశు సంరక్షణ సెలవులు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చేలోపు ఎప్పుడైనా ఈ సెలవులు వాడుకోవచ్చు * కుమ్రం భీం- అసిఫాబాద్, యాదాద్రి-భువనగిరి, భద్రాద్రి - కొత్తగూడెం, జోగులాంబ- గద్వాల, రాజన్న- సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లిగా ఆయా జిల్లాల పేర్లలో మార్పు

  • Loading...

More Telugu News