: యువకుడి శరీరంలో మహిళావయవాలు.. శస్త్ర చికిత్సతో తొలగింపు!
పశ్చిమ బెంగాల్ కు చెందిన పదహారేళ్ల యువకుడికి మహిళావయవాలు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. ఇటువంటి కేసులు చాలా అరుదైనవని, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇటువంటి వ్యక్తులు 10 మంది కంటే ఉండరని వైద్యులు చెప్పారు. ఈ యువకుడి శరీరంలో గర్భాశయం, అండాశయం, మూసుకుపోయిన యోని వంటి స్త్రీ అవయవాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆ యువకుడికి పలు శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. రెండు దశలలో నిర్వహించిన శస్త్రచికిత్సల ద్వారా ఆ యువకుడి శరీరంలోని మహిళావయవాలను తొలగించామని వైద్యులు పేర్కొన్నారు. ఈ తరహా వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, ఈ పరిస్థితిని పరిసిస్టెంట్ ములెరియన్ డక్ట్ సిండ్రోమ్ అని తమ పరిశీలనలో తేలిందని వైద్యులు వెల్లడించారు.