: పూర్తి స్పృహలో 'అమ్మ'... లేచి కూర్చున్న జయలలిత
చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రోజులో అధికభాగం స్పృహలో ఉంటున్నారని, మంచంపై ఆమె లేచి కూర్చుంటున్నారని వైద్యులు వెల్లడించినట్టు ఏఐఏడీఎంకే వర్గాలు తెలిపాయి. శ్వాసకోశ సమస్య పూర్తిగా తొలగనందున కృత్రిమ విధానంలోనే శ్వాస పీల్చుకుంటున్నారని తెలిపారు. ఊపిరి అందిస్తున్న ట్యూబుల తొలగింపు విషయంలో డాక్టర్లే నిర్ణయం తీసుకోనున్నారని వెల్లడించారు. త్వరలోనే అమ్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, గత నెల 22వ తేదీన ఆసుపత్రిలో చేరిన జయలలిత అప్పటి నుంచి అక్కడే ఉండి చికిత్స పొందుతుండగా, దేశ విదేశీ వైద్య నిపుణులు వచ్చి ఆమెను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.