: మేం తగ్గే ప్రసక్తే లేదు... కేసులు పెట్టినా భయపడం: 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రదర్శనపై రాజ్ థాకరే


ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మలు నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలపై వివాదం మరింత మదురుతోంది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను విడుదల కానివ్వమని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరే మరోసారి స్పష్టం చేశారు. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని... ఈ విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. తమపై కేసులు పెట్టినా భయపడమని చెప్పారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ సినిమాలో నటించిన కారణంగా... ఈ చిత్రాన్ని విడుదల కానివ్వబోమని ఎమ్మెన్నెస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా విడుదలకు సహకరించాలంటూ దర్శకనిర్మాత మహేష్ భట్ తో కలసి ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్, కరణ్ జొహార్ తదితరులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను నిన్న కలిశారు. ఈ సందర్భంగా, సినిమా విడుదలకు ఆటంకాలు కలగకుండా చూస్తామని రాజ్ నాథ్ కూడా హామీ ఇచ్చారు. అయినప్పటికీ రాజ్ థాకరే ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదల కాకుండా అడ్డుకొని తీరుతామని మరోసారి స్ఫష్టం చేశారు.

  • Loading...

More Telugu News