: హీరో రానాకు చుట్టుకుంటున్న 'రమ్మీ' కేసు
"రమ్మీ ఆడండి డబ్బులు గెలవండి" అంటూ హీరో రానా మీడియా ప్రకటనల్లో నటించడంపై కేసు నమోదైంది. పేకాటను ప్రోత్సహిస్తున్నారంటూ, రానా, ప్రకాష్ రాజ్ లపై తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన ఇళంగోవన్ అనే సామాజిక కార్యకర్త కేసు పెట్టాడు. వీరిద్దరూ ప్రజల మనసులను గ్యాంబ్లింగ్ వైపు మళ్లించేలా ప్రకటనల్లో నటిస్తున్నారని, పేకాటను ప్రమోట్ చేస్తున్న వీరి యాడ్లు టీవీల్లో వస్తున్నాయని కోయంబత్తూరు పోలీస్ కమిషనర్ కు ఆయన ఫిర్యాదు చేశాడు. బెట్టింగ్, రమ్మీ, గ్యాంబ్లింగ్ వంటి ఆటలపై నిషేధం అమలులో ఉండటంతో ఇళంగోవన్ ఫిర్యాదును స్వీకరించి విచారణ ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.