: ‘విశాఖ’లోని సంపత్ వినాయక ఆలయానికి బాంబు బెదిరింపు
విశాఖపట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలోని ప్రసిద్ధి చెందిన సంపత్ వినాయక దేవాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సంపత్ వినాయక టెంపుల్ కు నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో భక్తులు, అక్కడికి సమీపంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.