: బస్సులో ఆఫీసుకి వెళ్లిన ఎస్పీ.. ఆశ్చర్యపోయిన సిబ్బంది!
‘నేను బస్సెక్కితే ఆశ్చర్యపోతారు ఎందుకు?’ అని కాన్పూర్ రూరల్ ఎస్పీ ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. రూరల్ ఎస్పీగా కొత్తగా నియమితులైన ఆయన ప్రొటోకాల్ ప్రకారం కాన్వాయ్ లో ఆఫీసుకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆయన మాత్రం బస్సులో ప్రయాణించి ఆఫీసుకు చేరుకోవడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్నప్పుడే ప్రభుత్వ వాహనాలను వినియోగించుకుంటానని అన్నారు. బస్సులో ప్రయాణించడంతో తాను స్టూడెంట్ గా గడిపిన జీవితం గుర్తుకువచ్చిందని 2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఈ సందర్భంగా చెప్పారు.