: హిందూపురం 'నందమూరి'పురం.. రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: బాలయ్య
అనంతపురంలోని తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలోని గుడ్డం రంగనాథస్వామి దేవాలయంలో కోనేరు అభివృద్ధి పనులకు బాలయ్య చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హిందూపురంను నందమూరి పురం అని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ స్ఫూర్తితో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. హిందూపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తానని చెప్పారు.