: ఇక కర్నూలుపై కన్ను... 25న జగన్ యువభేరి
కర్నూలులో యువభేరీ నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. ఈ నెల 25న కర్నూలులో యువతను భాగం చేస్తూ, యువభేరి జరపనున్నట్టు ఆ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలూ సమావేశం కాగా, అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కార్యక్రమంలో జగన్ స్వయంగా పాల్గొంటారని, యువతీ యువకులతో ప్రత్యేక హోదాపై చర్చిస్తారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు హోదా ఎంతో అవసరమని, హోదా ప్రకటించేంత వరకూ తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వేళ, చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయక పోవడంపైనా నిరసన తెలియజేస్తామని అన్నారు.