: కోహ్లీ రిటైర్ అయ్యేనాటికి కచ్చితంగా దిగ్గజ ఆటగాడు అవుతాడంటున్న గంగూలీ


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అప్పుడే సూపర్ స్టార్ ని చేయవద్దని దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. రెండో వన్డేలో టీమిండియా పరాజయం అనంతరం గుంగూలీ మాట్లాడుతూ, కోహ్లీ దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరేందుకు చాలా సమయం ఉందని అన్నాడు. కోహ్లీ ప్రస్తుతానికి ప్రారంభంలోనే ఉన్నాడని చెప్పాడు. చాలా భవిష్యత్ ఉన్న కోహ్లీని సచిన్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలతో పోల్చవద్దని సూచించాడు. వారి సరసన చేరే సత్తా కోహ్లీలో ఉందని ఆయన అన్నాడు. మరో ఆరేళ్ల తరువాత కోహ్లీ గురించి అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం తన వద్ద ఉంటుందని గంగూలీ తెలిపాడు. అయితే కోహ్లీ అద్భుతంగా ఆడుతూ, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పాడు. ప్రణాళికలు ఎన్ని వేసినా, అంతిమంగా బాగా ఆడే జట్టునే విజయం వరిస్తుందని గంగూలీ తెలిపాడు. మైదానంలో ప్రదర్శనే విజేతను నిర్ణయిస్తుందని, విజయం కోసం చివరి బంతివరకు పోరాడాలని సూచించాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఎన్నో మ్యాచ్ లను టీమిండియా ఆడి గెలుచుకుందని గంగూలీ గుర్తు చేశాడు.

  • Loading...

More Telugu News