: నెల్లూరులో అదుపుతప్పి లారీ బీభత్సం.. ముగ్గురి మృతి


నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపుడి వద్ద ఈ రోజు ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. రోడ్డుపై అతి వేగంతో వెళుతూ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన గొర్రెలతో ఉన్న ఆటో ట్రాలీతో పాటు ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో స‌ద‌రు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వెంకటేశ్వర్లు, వెంకయ్య, భాస్కర్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వారుగా చెప్పారు. ఈ ముగ్గురు వ్య‌క్తులు తమ గొర్రెలతో చిలుకూరులో జరుగుతున్న సంతకు వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిపారు. వారంతా సంతకు ఆటో ట్రాలీలో త‌మ గొర్రెల‌ను తీసుకువెళుతున్నార‌ని, అయితే, డీజిల్ అయిపోవడంతో వారు దిగి ఆటోను పక్కకు నెడుతుండగా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పేర్కొన్నారు. లారీ ఢీ కొట్ట‌డంతో ఆటో ట్రాలీలో ఉన్న పది గొర్రెలు కూడా మృతి చెందాయి.

  • Loading...

More Telugu News