: జూబ్లీహిల్స్ లో తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ తీగ.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ లో ఈ రోజు పెను ప్రమాదం తప్పింది. వెంకటగిరి కాలనీలో హైటెన్షన్ విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడింది. ఆ సమయంలో తీగ కింద ఎవ్వరూ లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు విద్యుత్తును నిలిపివేశారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది హైటెన్షన్ వైరును తొలగిస్తున్నారు. తీగ తెగిపడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.