: మరోసారి పెద్దమనసును చాటుకున్న హీరో అక్షయ్ కుమార్
ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందరికంటే ముందు ఉంటాడు. ఇప్పటికే ఎందరికో, ఎన్నోసార్లు సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్న అక్షయ్ కుమార్... ఇటీవలే ఉరీ ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేశాడు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నిర్మాత రవి శ్రీవాస్తవకు అండగా నిలబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా శ్రీవాస్తవ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో, ఆయనకు వెంటనే ఆపరేషన్ చేయాలని, దానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అంత స్తోమత లేని శ్రీవాస్తవ... దేవుడి మీదే భారం వేసి సైలెంట్ అయిపోయారు. చివరకు, ఈ విషయం అక్షయ్ కుమార్ కు తెలిసింది. దీంతో వెంటనే రూ. 17 లక్షలను ఆయనకు పంపించాడు అక్షయ్.