: టపాసుల తయారీ కేంద్రం శివకాశిలో భారీ ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
భారతదేశంలో బాణసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని శివకాశిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో, బాణసంచాను శివకాశి నుంచి ఇతర ప్రాంతాలకు లారీలో తరలిస్తుండగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మంది క్షతగాత్రులయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించగా, రంగప్రవేశం చేసిన అగ్నిమాపకసిబ్బంది 3 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పి గోదాములో చిక్కుకున్న 25 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. కాగా, క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.