: ఢిల్లీ వన్డే అప్డేట్స్: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. ఓపెనర్లుగా క్రీజులోకి రోహిత్, రహానే
న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఈ రోజు జరుగుతున్న రెండో మ్యాచులో టీమిండియా ముందు న్యూజిలాండ్ టీమ్ 243 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెలిసిందే. లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రహానే క్రీజులోకి వచ్చారు. రెండు ఓవర్లకి 6 పరుగులు చేసి ఆట కొనసాగిస్తున్నారు.