: తాత చంద్రబాబు కన్నా మనవడు దేవాన్షే ఆస్తిపరుడు!
తాత చంద్రబాబు కన్నా మనవడు దేవాన్షే ఆస్తిపరుడు. దేవాన్ష్ తండ్రి నారా లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను స్వయంగా నిన్న ప్రకటించిన విషయం విదితమే. 18 నెలల వయసు గల దేవాన్ష్ మొత్తం ఆస్తులు రూ.11.57 కోట్లు కాగా, ఏపీ సీఎం, దేవాన్ష్ తాత నారా చంద్రబాబు నాయుడి మొత్తం ఆస్తులు రూ.3.73 కోట్లు (చంద్రబాబుకు చెందిన పాత అంబాసిడర్ కారు సహా). నాయనమ్మ భువనేశ్వరి రూ.9.17 కోట్ల విలువైన ఆస్తులను దేవాన్ష్ పేరిట ట్రాన్స్ ఫర్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు, తల్లి తరపు తాతయ్య అయిన బాలకృష్ణ తన మనవడు దేవాన్ష్ కు గిఫ్ట్ గా రూ.2.4 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు.