: కరణ్ జొహార్ ప్రతి రోజూ దేశభక్తిని నిరూపించుకోవాలా?: శ్యామ్ బెనగల్
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్ ను జాతివ్యతిరేకి అనడం చాలా బాధాకరమని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం మీద కరణ్ కు ఉన్న దేశభక్తిని ఎవరైనా ఎలా శంకిస్తారని ఆయన ప్రశ్నించారు. తన దేశభక్తిని కరణ్ ప్రతి రోజు నిరూపించుకోవాలా? అన్నారు. కరణ్ ఈ దేశంలోనే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే పని చేస్తున్నారు, మిగిలిన జీవితాన్ని కూడా ఇక్కడే గడుపుతారని అన్నారు. కరణ్ మన సమాజంలో ఓ ముఖ్యమైన వ్యక్తి అని, విజయవంతమైన వ్యక్తి అని... అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతోందని ప్రశ్నించారు.