: విద్యార్థులకు కొత్త ట్రీట్మెంట్ రుచిచూపిన పోలీసులు


హైదరాబాదు, మీర్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో వారు ఘర్షణకు దిగారు. తరగతి గదిలోనే కొట్టుకున్నారు. దీంతో వారిని నిలువరించిన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దండిస్తే తల్లిదండ్రులతో ఇబ్బంది ఉందన్న కారణంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీంతో ఘర్షణపడ్డ విద్యార్థులును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు, ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు. తరువాత వారితో లగేజ్ మోయించారు. ఇంకోసారి చదువు మానేసి ఇతర విషయాలపై దృష్టిపెడితే తోలు తీసేస్తామని హెచ్చరించారు. దీంతో ఇంకోసారి ఘర్షణపడమని వారు పోలీసులను వేడుకున్నారు.

  • Loading...

More Telugu News