: భారత జవాన్ల నుంచి లాక్కెళ్లిన గన్స్ హిజ్బుల్ ఉగ్రవాదుల చేతుల్లోకి... వీడియో విడుదల


గత వారంలో కాశ్మీర్ లోయలో ఓ టీవీ టవర్ కు కాపలాగా ఉన్న పోలీసుల నుంచి ఉగ్రవాదులు లాక్కెళ్లిన తుపాకులు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల చేతుల్లోకి చేరాయి. ఈ తుపాకులను ప్రదర్శిస్తూ, హిజ్బుల్ తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాలుగున్నర నిమిషాలున్న ఈ వీడియోలో, భారత పోలీసుల నుంచి తీసుకు వెళ్లిన ఇన్సాస్ తుపాకులను చూపిస్తూ, ఉగ్రవాదులు ఒకరిని ఒకరు అభినందించుకుంటున్నారు. యువకులు జీహాదీలుగా మారాలని సలహా ఇస్తున్నారు. "ఎవరైనా మాతో చేరాలంటే, ఓ ఆయుధాన్ని ఎత్తుకురండి. మేం వారిని సాదరంగా ఆహ్వానిస్తాం" అని జకీర్ అనే యువకుడు ఈ వీడియోలో చెబుతుండటం కనిపిస్తోంది. కాగా, గత మూడు నెలల వ్యవధిలో 12 సార్లు భారత జవాన్లు, పోలీసుల ఆయుధాలను దొంగతనం, బెదిరించి లాక్కెళ్లడం వంటి ఘటనలు నమోదు కాగా, ఏకే 47, ఇన్సాస్, కార్బైన్, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్స్ మొత్తం 67 ఉగ్రవాదుల పరమైనాయి.

  • Loading...

More Telugu News