: ఏపీ సెక్రటేరియట్ వద్ద భారీ సెక్యూరిటీ... 325 సీసీ కెమెరాల ఏర్పాటు
అమరావతిలోని వెలగపూడి వద్ద నిర్మించిన ఏపీ సెక్రటేరియట్ కు భారీ భద్రత కల్పిస్తున్నారు. అక్కడున్న ఆరు బ్లాకులకు కలిపి ఏకంగా 325 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, సెక్రటేరియట్ లోకి రావాలంటే ముఖ్యమంత్రి సహా ఎవరైనా సరే ఐడెంటిటీ కార్డు ఆధారంగానే రావాల్సి ఉంటుంది. సందర్శకుల కోసం ప్రత్యేక పాసులు జారీ చేస్తారు. సెక్రటేరియల్ లోకి వెళ్లిన సందర్శకులు ఎవరిని కలవాలనుకున్నారో వారినే కలవాల్సి ఉంటుంది... ఇతర చోట్లకు వెళ్లడానికి పర్మిషన్ ఉండదు. దీనికి అనుగుణంగానే పాసులను ఇస్తారు. ఎవరైనా సరే కార్డును స్వైప్ చేస్తేనే డోర్ ఓపెన్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.