: 50 లక్షలిస్తే ఎమ్మెల్యే పార్టీ మారిపోయేవాడు...ఇప్పుడు కార్పొరేటర్ కూడా మారడం లేదు: అజిత్ పవార్
రాజకీయాల్లో మారిన పోకడలపై మహారాష్ట్రలోని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. షోలాపూర్ జిల్లాలోని కర్మాలా నగరంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో 50 లక్షల రూపాయలిస్తే ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయేవాళ్లని అన్నారు. అదే 50 లక్షల రూపాయలు ఇప్పుడిస్తే కనీసం కార్పొరేటర్లు కూడా పార్టీ మారట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆ ఎమ్మెల్యేలను ఎవరైనా కొనేస్తారన్న భయంతోనే ఆయన అలా వారిని బెంగళూరుకు తరలించారని ఆయన చెప్పారు. ఇలా పార్టీలు మారే నేతలకు టికెట్లు ఇవ్వవద్దని ఆయన సూచించారు.