: కేజ్రీవాల్‌పై జైట్లీ పరువు నష్టం కేసు: కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరణ
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో తిరస్కరణకు గురయింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కొన్ని రోజుల క్రితం కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు వేశారు. అయితే, ఆ కేసులో న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకోవాలని కేజ్రీవాల్ ప్రయత్నించారు. ఈ అంశంలో దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.