: పవన్ కల్యాణ్ తో ఎటువంటి విభేదాలు లేవు: నారా లోకేశ్


జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తో తమకు ఎటువంటి విభేదాలు లేవని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి పవన్ కల్యాణ్ వ్యతిరేకం కాదని అన్నారు. ఆక్వా ఫుడ్ కంపెనీ విషయమై పవన్ కల్యాణ్ లేవనెత్తిన సందేహాల నివృత్తికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది నేతలు చూస్తున్నారంటూ పరోక్షంగా వైఎస్సార్సీపీపై విమర్శలు కురిపించారు.

  • Loading...

More Telugu News