: 'ధోనీ' సినిమా హిట్ తో రెమ్యూనరేషన్ ను రెండింతలు చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్


'ధోనీ' బయోపిక్ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన రెమ్యూనరేషన్ ను డబుల్ చేసేశాడు. సక్సెస్ కు డిమాండ్ ఉన్న సినీ పరిశ్రమలో 'కై పో చే' సినిమాతో మంచి విజయం అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్... 'ధోనీ' సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో 'సుల్తాన్' తరువాత భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా 'ధోనీ బయోపిక్' కావడం విశేషం. దీనికి తోడు ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన రెమ్యూనరేషన్ రెట్టింపు చేశాడు. తనకు కథలు వినిపించాలనుకునే నిర్మాతల నుంచి 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో బాలీవుడ్ నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై ఓ నిర్మాత మాట్లాడుతూ, ఈ సినిమా ధోనీకున్న క్రేజ్ వల్ల కాకుండా, తన వల్లే ఈ సినిమా హిట్ అయిందని సుశాంత్ భావించడమే సమస్యగా మారిందని ఓ నిర్మాత పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News