: ఫిలిప్పీన్స్ లో దారుణం.. ఆందోళనకారులపైకి తమ వాహనాలను ఎక్కించిన పోలీసులు


ఫిలిప్పీన్స్ లో దారుణం చోటుచేసుకుంది. చైనాతో సరిహద్దు భద్రత సమస్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ కు మద్దతుగా అమెరికా దళాలు ఆ దేశంలో సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రజలు ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, వాహనాలపై వచ్చి ఆందోళన కారులపైకి వాహనాలు ఎక్కించేశారు. పోలీసుల దాష్టీకంలో ఎంతో మంది గాయాలపాలయ్యారు. ఫిలిప్పీన్స్ ఆందోళనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News