: చరిత్ర సృష్టించిన సానియా మీర్జా


భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్ లో వరుసగా 80 వారాల పాటు నెంబర్ వన్ గా నిలిచి సత్తా చాటింది. గత సీజన్ లో మార్టినా హింగిస్ తో కలసి వోల్వో కార్ ఓపెన్ టైటిల్ గెలిచి నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న సానియా... అప్పటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. సానియా, మార్జినా హింగిస్ లు కలసి 12 నెలల్లో ఏకంగా 13 టైటిళ్లు కైవసం చేసుకున్నారు. 41 మ్యాచ్ లను వరుసగా గెలుపొందారు. గత ఆగస్టులో ఈ జంట విడిపోయింది. భారతదేశం తరపున నంబర్ వన్ ర్యాంక్ ను దక్కించుకున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాత్రమే. ఇదొక అద్భుత ప్రయాణమని... మరింత కష్టపడటానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేసింది. మరోవైపు, సానియా సాధించిన ఘనతకు మహేష్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాలలు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News