: 'కూతురితో డేటింగ్ చేసేవాడిని' అన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన కూతురి స్పందన...!


గతంలో తాను చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన డొనాల్డ్ ట్రంప్ ను మరో కొత్త వివాదం వెంటాడుతోంది. "నేను మరో 20 ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే... నా కూతురితో కచ్చితంగా డేటింగ్ చేసేవాడిని" అంటూ 2008లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. కూతురితో డేటింగ్ ఏమిటి? అని ప్రశ్నించిన సదరు మీడియా సంస్థ... ఇవాంకా (ట్రంప్ కూతురు) ట్రంప్ కు సెరోగేట్ వైఫ్ (మారు భార్య) అంటూ ఛండాలపు ప్రచారం కూడా చేసింది. దీనిపై ట్రంప్ కూతురు ఇవాంక్ స్పందించింది. బాధ్యత గల మీడియా తండ్రీకూతుళ్ల గురించి అలా ప్రచారం చేయవచ్చా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తండ్రి అలా మాట్లాడం తప్పేనని, ఆ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ఇవాంక తెలిపింది. అయితే, ఆ వీడియో బయటకు వచ్చిన వెంటనే కుటుంబానికి, అమెరికన్లకు ఆయన క్షమాపణలు చెప్పారని, తన తండ్రి గురించి మీడియా కంటే తనకే ఎక్కువ తెలుసని, అందుకే తన తండ్రిని తాను అర్థం చేసుకోగలనని ఆమె అన్నారు. మరోవైపు, ట్రంప్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన భార్య మెలానియా కూడా ఖండించారు.

  • Loading...

More Telugu News