: ఇన్ ఛార్జి మంత్రులూ! మొక్కుబడి పర్యటనలు చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఇన్ ఛార్జి మంత్రులు మొక్కుబడిగా పర్యటనలు చేయొద్దని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. విజయవాడలో ఈరోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, జన చైతన్య యాత్రల్లో నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. ఇన్ ఛార్జి మంత్రులు నెలకు 5 రోజులైనా ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నెలకు 10 రోజులు పర్యటించాలని సూచించారు. ఎంపీలు తమ పర్యటనకు సంబంధించిన నివేదికలను పార్టీ కార్యాలయానికి పంపాలను సూచించారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు. కాగా, ఈ నెల 21న సీఎం నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది.