: పెంపుడు చేప ఖరీదు రూ.800.. దాని వైద్య ఖర్చు రూ.33 వేలు!
పెంపుడు చేప ఆరోగ్యం కోసం డబ్బును లెక్కచేయని ఆస్ట్రేలియా వాసి దానిపై తనకున్న ప్రేమను ఓ యువతి తెలియజెప్పింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.800 ఖర్చు పెట్టి, ఒక గోల్డ్ ఫిష్ ను కొనుగోలు చేసింది. తర్వాత ఓ వస్తువును మింగేసిన ఆ చేప ప్రాణం కాపాడడం కోసం సుమారు రూ.33 వేలు ఖర్చు చేసింది. బ్రిస్బేన్ కు చెందిన 21 సంవత్సరాల ఎమ్మా మార్ష్ ఒక గోల్డ్ ఫిష్ ను కొనుగోలు చేసింది. తన ఇంట్లో ఉన్న అక్వేరియంలో దానిని పెంచుకుంటోంది. 12 డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన ఈ గోల్డ్ ఫిష్ ఒక రోజు అక్వేరియంలోని ఒక చిన్న గులకరాయిని మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మా మార్ష్, వెంటనే అక్వేరియం సహా చేపను పట్టుకుని సమీపంలోని వెటర్నిటీ సర్వీసు సెంటర్ కు వెళ్లింది. గోల్డ్ ఫిష్ మింగిన వస్తువును బయటకు తీసేందుకుగాను వైద్యులు ఎంతగానో శ్రమించి చివరకు సఫలీకృతులయ్యారు. గోల్డ్ ఫిష్ మింగిన వస్తువును బయటకు తీసిన అనంతరం ఒకరోజు చికిత్స నిమిత్తం దానిని ఆసుపత్రిలోనే ఉంచారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ, ఆసుపత్రి బిల్లు విషయమే కంగుతినిపించేలా ఉంది. ఎమర్జెన్సీ సర్వీసు కింద 100 డాలర్లు, వైద్యుడి ఫీజు కింద 400 డాలర్లు కలిపి మొత్తం 500 డాలర్లు (సుమారు 33 వేలు) మార్ష్ ఎమ్మా నుంచి వసూలు చేశారు.